- జాతర ఉత్సవాలకు తెరలేపిన మేస్రం వంశీయులు
- ఏడు గ్రామాలకు జాతర ఆహ్వానం
ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : ప్రకృతి ఆరాధకులైన ఆదివాసులు పుష్యమాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏటా ఈ మాసంలో ఆరాధ్య దైవం వర ప్రదాయినిగా నాగోబా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆదివాసి సంప్రదాయం ప్రకారం అత్యంత కఠిన నియమనిష్ఠలతో ఏటా పుష్య మాసంలో ఈ పూజలు జరపడం జరుగుతుంది.
శుక్రవారం ప్రఖ్యాతిగాంచిన కేస్లాపూర్ గ్రామం నుండి రథయాత్రను ప్రారంభించారు. ఈనెల 28న జరిగే కేస్లాపూర్ నాగోబా జాతరకు తమ కులస్తులను ఆహ్వానంగా మర్యాదపూర్వకంగా ఏడు గ్రామాల్లో మకాం వేస్తూ వారిని పిలుస్తారు. ఈ సందర్భంగా కటోడ ప్రధాన్ లు ఈ రథంపై వెళ్లడం ఆనవాయితీ. నేడు కేస్లాపూర్ కుండా సిరికొండ మండలం రాజంపేట వద్ధ బసచేస్తూ ఆనవాయితీగా జాతరకు కుండలు చేసే కుమ్మరికి నూతన కుండలను నిర్మించడానికి ఆదేశిస్తారు. అలాగే 4వ తేదీ, రాజంపేట నుండి కువాడికి వెళ్తారు.
5వతేదీ నా సోయంగూడకు వెళ్తారు. 6వ తేదీ సోయంగూడ నుండి గిన్నెరకు వచ్చి బస చేస్తారు. 7వతేదీన గిన్నె రా నుండి సాలివాడకు వెళ్తారు. అలాగే 8వ తేదీన సాలివాడ నుండి బయలుదేరి వడగంలో బస చేస్తారు. 9వతేదీన పొడగమ నుండి బయలుదేరి కేస్లాపూర్ నుండి ఇంటి వద్దకు వస్తారు. ఇలా ఏడు రోజులపాటు వీరి సంస్కృతిలో భాగంగా జాతరకు ఆహ్వానంగా బంధుమిత్రులను పిలవడం అనవాయితీ.