Sunday, November 24, 2024

First Warning – గోదావ‌రి ఉధృతం – భ‌ద్రాచ‌లం వ‌ద్ద 44.1 అడుగుల నీటి మట్టం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, భ‌ద్రాచ‌లం : మ‌హ‌రాష్ట్ర‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రిలో నీటి మ‌ట్టం 44.1 అడుగుల‌కు చేరుకుంది. దీంతో మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రికాను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వాగులు, చెరువులు వద్దకు ఎవరు సందర్శకులు వెళ్ల కూడదని, మత్స్యకారులు గోదావరిలో దిగ‌రాద‌ని హెచ్చరించారు.

ఇంకా నీటి మ‌ట్టం పెరిగే అవ‌కాశం
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గోదావ‌రిలో నీటి మ‌ట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement