Tuesday, November 26, 2024

TS : నిర్విఘ్నంగా తొలి ఘట్టం..నేడు గద్దెపైకి సమ్మక్క…

మేడారం మహా జాతరలో తొలి ఘట్టం పూర్తయింది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న బుధవారంఅర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు.

ఇవాళ, మధ్యాహ్నం నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్‌, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిన్వహించనున్నారు.

- Advertisement -

అయితే, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చి మేడారం గుడి దగ్గరకు సారలమ్మకు ఘన స్వాగతం పలికారు. సారలమ్మను కనులారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సారలమ్మను తోడ్కోని వచ్చే ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక, పూజల తర్వాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు వచ్చి సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు వేసి కంకవనానికి కంకణాలు కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement