జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి మెట్ పల్లి పట్టణానికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో బాధితున్ని హైదరాబాద్ టిమ్స్ కు తరలించారు. అయితే, బాధితుడు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. అయితే, వైద్య అధికారులు బాధితుడికి నచ్చచెప్పి హైదరాబాద్ తరలించారు.
ఈనెల 25న శంషాబాద్ ఏయిర్ పోర్టులో బాధితుడి శాంపిల్స్ ని పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లుగా జిల్లా వైద్యాధికారి తెలిపారు. మెట్ పల్లికి వచ్చిన తర్వాత బాధితుడు గత మూడురోజులుగా పలు ప్రాంతాల్లో తిరిగినట్లు స్థానికుల చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital