షెడ్యూల్ ఖరారు
పెట్టుబడులు ఆకర్షించడమే అజెండా
వారం రోజుల పాటు అక్కడే
పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటి
రేవంత్ తో పాటు మంత్రులు,ఉన్నత స్థాయి అధికారులు
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముఖ్యమంత్రిగా బాధ్యతలలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటించనున్నారు.. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారు అయింది.. హైదరాబాద్ నుంచి ఆయన అగస్ట్ మూడో తేదిన అమెరికాకు బయలుదేరనున్నారు.. అక్కడే వారం రోజుల పాటు ఉండనున్నారు.. ఈ పర్యటన పెట్టుబడ్డులు ఆకర్షణే ప్రధాన అజెండా గా ఉంది.. అమెరికాలోని పలు స్టేట్ లలోని పలువురు పారిశ్రామిక వేత్తలను, ఐటి కంపెనీల యాజమాన్యాలను రేవంత్ కలువ నున్నారు.. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ఆయన వారికి వివరించానున్నారు.. ఈ పర్యటనలో రేవంత్ తో పాటు మంత్రులు , ఉన్నత స్థాయి అధికారులు పాల్గొంటారు.. తిరిగి రేవంత్ హైదరాబాద్ 11న తిరిగి వస్తారు..