భద్రాచలం – పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు 44.4 అడుగులకు నీటిమట్టం చేరింది.
మరో రామాలయంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతున్నది. ఆలయం సత్రంలోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున ఇంకా గోదావరిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గోదావరిలో 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద జారీ చేస్తారు. వరదల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అధికారులను అప్రమత్తం చేశారు.