Tuesday, November 26, 2024

సింగరేణిలో మొదటి రోజు సమ్మె సక్సెస్


ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి కోల్ బెల్ట్ లో మొదటి రోజు గురువారం నుండి సమ్మె సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెందిన కోయగూడెం ఓసీసీ 3, సత్తుపల్లి ఓసీపి 3. శ్రావణ పల్లి గని, కళ్యాణి ఖని 6 మొత్తం నాలుగు బొగ్గు గనులను కాంట్రాక్టుకు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ పరిణామంతో సింగరేణిలో నియమకాలు తగ్గడమే కాకుండా సంస్థ పూర్తిగా ప్రైవేటు పరమ‌య్యే అవకాశముంద‌ని, వాటిని ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ పరం చేయనిచ్చే ప్రసక్తి లేదని కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి.
ఉపరితల, భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం :
జయశంకర్ జిల్లా భూపాలపల్లి కోలివాల్స్ పరిధిలో కేటీకే 1, కేటీకే 5, కేటీకే 6, కేటీకేరి భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ 2, 3 గనులు ఉన్నాయి. ఆయా గనుల్లో మొత్తం 5,550 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సమ్మెలో అత్యవస‌ర విభాగానికి చెందిన 189 మంది టెక్నీకల్ సిబ్బంది మినహా ఆయా గనుల్లోని మిగతా కార్మికులు మూడు షిప్టుల్లో అందరు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. భూపాలపల్లి డివిజన్ లో ఉపరితల గనులతో పాటు భూగర్భ గనులలో నిత్యం సునూరు 7,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉండగా సమ్మె ప్రభావంతో గురువారం పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి దెబ్బతిన్నది. మరో 48గంటల పాటు సమ్మె జరుగనున్న నేపథ్యంలో మరో 14,400 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో సింగరేణికి రోజుకు 100 టన్నులకు గాను రూ 2కోట్ల 20 లక్షల నష్టం వాటిల్లనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
సమ్మెకు మద్దుతు తెలిపిన పలుపార్టీల నాయకులు :
కార్మిక సంఘాల వికాస ఆధ్వర్యంలో పెట్టిన 12 గంటల సమ్మెకు కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ టీసీ పార్టీలు, సీసీల అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, తమ‌ పూర్తి మద్దతు ప్రకటించాయి. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి ప్రధాన రహదారి పై ధర్నా, రాస్తారోకో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ నాయకులు గండ్ర సత్యనారాయణ రావు, ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేష్, కుడుదుల వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, వైఎస్ఆర్టీపీ నాయకులు అప్పం కిషన్, ఐఎన్‌టీయూసి నాయకులు జోగ బుచ్చయ్య, పసునూటి రాజేందర్, బానోతు రాములు, సీఐటీయూ నాయకులు కంపేటి రాజయ్య, టీబీజీకేఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, బీఎంఎస్ నాయకులు అప్పాని శ్రీనివాస్, బిఎఫ్ టీయూ నాయకులు బుర్రి కుమారస్వామి తదితర కార్మిక, రాజకీయ పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగట్టారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలో మోడీ ఓకోసి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మిక వ్యవస్థనే రద్దు చేసే విధంగా ఆలోచనలు చేస్తుందన్నారు. వెంటనే కేంద్రం నాలుగు బొగ్గు గనుల ప్రవేటీకరణకు దేగు ఆలోచనలు విరమింప చేసుకోవాలని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు ప్రవేశ పెట్టి 750 మంది చనిపోయార‌న్నారు. అయితే త‌ర్వాత‌ సమావేశంలో నల్లచట్టాలను రద్దు చేశారన్నారు. మరోసారి కార్మికుల ఆగ్రహానికి గురికాకముందే మోదీ బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement