తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు బాద్యతలు స్వీకరించనున్నారు.. అనంతరం తొలి ఉద్యోగం ఆమెకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..ఈ మేరకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం కల్పిస్తూ రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆ యువతికి ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు సమాచారం.
వివరాలలోకి వెళితే … నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె పీజీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఎన్నికల సమయంలో గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. చలించిపోయిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆ యువతి కల నెలవేరనుంది. రేపు ఎల్బీ స్టేడియంలో దివ్యాంగ యువతి రజినికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు.