కాబోయే సిఎం అంటూ కాంగ్రెస్ పార్టీ అనుముల రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన వెంటనే.. ఆయన తుఫాన్ హెచ్చరికలపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ పోస్టు చేశారు..
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.
అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.