Thursday, November 21, 2024

TG | ఆలేరు వ‌ద్ద అగ్ని ప్ర‌మాధం.. భారీగా ఆస్తి న‌ష్టం!

ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ ఎలక్ట్రికల్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో దుకాణ యజమాని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement