Sunday, September 8, 2024

ఫుడ్ రెస్టారెంట్ లో అగ్నిప్ర‌మాదం – భారీగా ఆస్తి న‌ష్టం

ఓ ఫుడ్ రెస్టారెంట్ లో మంట‌లు చెల‌రేగాయి. దాంతో ఆ మంట‌లు రెస్టారెంట్ మొత్తానికి విస్త‌రించాయి. మంట‌లు పెద్ద ఎత్తున్న ఎగ‌సిప‌డుతున్నాయి. ఈ ప్ర‌మాదం వ‌రంగ‌ల్ చౌర‌స్తాలోని మ‌ను ఫుడ్ రెస్టారెంట్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్‌తోపాటు మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement