ఓయూ పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. తార్నాక డివిజన్ స్ట్రీట్ నెంబర్ వన్ లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్దం అయ్యాయి.
ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ప్రమాదం షాక్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఆస్తి నష్టం బాగానే జరిగినప్పటికీ పూర్తిగా అంచనాకు రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.