ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్మద్యం డిపోలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మద్యం డిపోలో మంటలు చేలరేగాయి. మద్యం డిపో కావడంతో మంటలు వేగంగా చుట్టుముట్టి భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన లో కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం డిపోలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement