Saturday, January 4, 2025

Fire Accident – కొండాపూర్‌ గాలక్సీ అపార్ట్‌మెంట్‌ లో పేలిన గ్యాస్ సిలిండర్

హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం వేళ కొండాపూర్‌లోని గాలక్సీ అపార్ట్‌మెంట్‌ తొమ్మిదొవ అంతస్తులో మంటలు చెలరేగాయి.

గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించి తీవ్రరూపం దాల్చాయి.అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినప్పుడు ఇంట్లో మహిళ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.అలాగే మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement