ఆంధ్రప్రభ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జియాగూడ గోపీ హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అపార్ట్మెంట్లోనే ఫర్నిచర్ తయారీ గోడౌన్ ఉండడంతో దానికి మంటలు అంటుకున్నాయి. ఇట్లా పెను మంటలు అలుముకున్నట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. 8 అంబులెన్సులు, నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలార్పే పనులు చేపట్టారు. అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారికి బయటకు తీసుకొస్తున్నారు. గంట సేపటి నుంచి మంటలు అదుపులోకి రాలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Breaking | హైదరాబాద్లో అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న ఫర్నిచర్ గోదాం
Advertisement
తాజా వార్తలు
Advertisement