Wednesday, November 20, 2024

Fire Accident – వరంగల్ లో పాత ఫర్నిచర్ షాప్ బుగ్గి

కరీమాబాద్ ఆగస్టు 27 (ప్రభ న్యూస్) వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందివరంగల్ అండర్ బ్రిడ్జ్ రోడ్ శివనగర్ ఇసుక అడ్డ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు అంటుకోవడంతో ఫర్నిచర్ షాప్ లో ఎగిసిపడుతున్న మంటలను అర్పుతున్న ఫైర్ సిబ్బంది. సుమారు మూడు గంటలు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఎస్ కె ట్రేడర్స్ పాత ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది షాప్ యజమాని ఎస్.కె హాసన్ కథనం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంటలు అంటుకుంటున్నాయని సమాచారం అందిందని వెంటనే అక్కడికి చేరుకున్నాం చేరుకునే అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు.

- Advertisement -

.

షాప్ యజమాని స్థానికుల కథనం ప్రకారం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి వేయడం వల్ల ఫర్నిచర్ షాపు అంటూ కోవడం జరిగిందని పక్కనే వైన్ షాపు ఉంటుందని అర్ధరాత్రి వరకు కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూనే ఉంటారని అందులో ఎవరో సిగరెట్ తాగి అక్కడ పడడం వల్ల మంటలను ఆయన వెల్లడించారు.

పాత ఫర్నిచర్ షాపులో మూడు షాపులు ఉంటాయని రెండు ఫర్నిచర్ షాపులు కాగా, మరొకటి బార్ధాన్ షాప్ పాత ఫర్నిచర్ షాపులో సుమారు 4 లక్షల పాతటేకు కర్ర, దర్వాజాలు కిటికీలు మిషనరీ అగ్నికి ఆహుతి కాగా, బార్ధాన్ షాపులో సుమారు మూడు లక్షల గోనె సంచులు అగ్నికి ఆహుతి అయ్యాయని వెల్లడించారు.

3అగ్నిమాపక వాహనాలు, సిబ్బందితో చేరుకొని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మిల్స్ కాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి మల్లయ్య, సబ్ ఇన్స్పెక్టర్ చందర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నమని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement