Saturday, December 21, 2024

Fire Accident – మాదాపూర్ ఐటి కాంప్లెక్స్ లో అగ్ని ప్ర‌మాదం …….

హైద‌రాబాద్ – మాదాపూర్ లోని ఓ రెస్టారెంట్ లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తులు ఉన్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో అనేక ఐటీ కంపెనీలు, రెస్టారెంట్లు ఉన్నాయి.

అయిదు అంతస్తుల బిల్డింగ్ లోని ఓ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంట‌నే పేలుడు సంభ‌వించింది.. దీని ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులు కొందరికి గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన రెస్టారెంట్ కి ఎదురుగా విరాట్ కోహ్లీ కి చెందిన రెస్టారెంట్ కూడా ఉంది. సత్వ భమనంలోని సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంట‌లు శ్ర‌మించి మంటలను అదుపుచేశారు.. ఇక ఐటి కంపెనీలో ఉన్న ఉద్యోగులందరినీ సుర‌క్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. వారిలో కొంద‌రికి స్వ‌ల్ప గాయాలు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement