Tuesday, November 26, 2024

Fire: బాన్సువాడ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలోని రోగులను బయటకు తరలిస్తున్నారు. మరో వైపు అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలో మంటలను ఫైరింజన్లతో అదుపు చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement