జూలపల్లి, (ప్రభన్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వరంలా మారాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. జూలపల్లి మండలంలోని 59 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి ద్వారా మంజూరైన రూ. 59,06,844ల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చెశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కళ్యాణలక్ష్మి ద్వారా రూ. లక్షా 116లను అందిస్తూ భరోసా ఇస్తున్నారన్నారు. నిరంతరం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని, ప్రజలంతా గులాబీ జెండాకు అండగా ఉండాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కుసుకుంట్ల రమా రాంగోపాల్ రెడ్డి, జడ్పీటీ-సీ బొద్దుల లక్ష్మీ నర్సయ్య, ఏఎంసీ ఛైర్మెన్ కంది చొక్కారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మెన్ వెంకటయ్య, కన్వీనర్ కుంట రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింహం, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీ-సీలు, కో ఆప్షన్ లాల్ మహ్మద్‌తోపాటు తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement