Friday, November 22, 2024

ఇంజనీరింగ్ ర్యాంకర్ కు ఆర్థిక సహాయం

పెద్దమందడి, (ప్రభ న్యూస్) : నిరుపేద సరస్వతి పుత్రునికి జిల్లా గిరిజన ఉద్యోగ సంఘం ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడింది. మండల పరిధిలోని గట్ల ఖానాపూర్ తండాకు చెందిన అంగోత్ యాదగిరి జె ఈ ఈ ఈ మెయిన్స్ లో అల్ ఇండియా 744 ర్యాంక్ సాధించి ప్రతిష్టాత్మక జెంషెడ్ పూర్ (ఝార్ఖండ్ స్టేట్) లోని ఎన్.ఐ.టి లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. అతని తల్లిదండ్రులు అత్యంత పేదరికంలో కూలీ చేస్తే గాని కడుపు నిండని పరిస్థితి.

కనీసం కళాశాల ఫీజు కట్టడానికి డబ్బులు లేని స్తితిలో ఉన్నందున ఈరోజు రూ.25000లు వనపర్తి గిరిజన ఉద్యోగుల సంఘం తరుపున వనపర్తి జిల్లా కార్యాలయంలో యాదగిరికి అందజేశారు. రాజేంద్రనగర్ లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవేశ పెట్టిన సూపర్ 30లో సెలెక్ట్ అయి జెఈఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 744 ర్యా0క్ సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ విషయం తెలిసిన వెంటనే యాదగిరిని ఆదుకోవాలని తలచి అతని ఫీజులకు సరిపడా రూ.20000లు, ఖర్చులకు రూ. 5000ల‌ను గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్యలాల్, ప్రధాకార్యదర్శి అర్జున్ నాయక్ సేవా సంఘం అధ్యక్షుడు జాత్రు నాయక్ చేతులమీదుగా యాదగిరికి అందించారు. ఈ కర్యక్రమంలో ఉపాధ్యాయులు అమ్రునాయక్, లక్ష్మణ్ నాయక్, జానయ్య, కృష్ణ, రాజ్య, తారు,హన్మంతు,శంకర్, బస్తిరాం, దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement