పోలింగ్ ఎట్ 66.3 శాతం-2019 పోలింగ్ పర్సెంటేజి 62శాతమే-4శాతం అధికం3,32,16,348మంది లో 2,20,24,806 మంది ఓటు నమోదుభువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 76.78శాతంహైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 48.48శాతం అత్యల్ప ఓటింగ్‌అత్యధికంగా నర్సాపూర్ అసెంబ్లిd సెగ్మెంట్‌లో 84.25శాతంమలక్‌పేట్ అసెంబ్లిd సెగ్మెంట్ పరిధిలో కేవలం 42.76శాతంతో అత్యల్ప పోలింగ్-ఓటర్లకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 66.3శాతంగా నమోదైంది. ఎన్నికల సంఘం మంగళవారంనాడు రాత్రి తుది పోలింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించింది. తొలుత పోలింగ్ రోజున ట్రెండ్స్‌ను అంచనా వేసిన ఈసీ 70శాతం దాటనుందని అంచనా వేసినప్పటికీ సమయం పొడిగించిన నేపథ్యంలో 6 గంటల తర్వాత పెద్దగా ఓట్లు పోల్ కాలేదు. దీంతో తుది పోలింగ్ శాతం 66.3శాతానికి పరిమితమైంది. అయితే 2019లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 62.77శాతాన్ని అధిగమించడం విశేషం.
.17లోక్‌సభ నియోజకవర్గాలలో 3,32,16,348మంది ఓటర్లకుగానూ 2,20,24,806మంది ఓటర్లు ఓటేశారు. ఇది మొత్తంగా 66.3శాతానికి చేరుకుంది. 2,18,14,035 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నేరుగా ఓటేయగా, 2,10,771మంది పోస్టల్ బ్యాలెట్, హోంఓటింగ్ విధానంలో పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 76.78శాతం పోలింగ్ జరగ్గా, హైదరాబాద్‌లో 48.48శాతం అత్యల్ప ఓటింగ్ నమోదైంది.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం
ఆదిలాబాద్ 74.03భువనగిరి 76.78చేవెళ్ల 56.50హైదరాబాద్ 48.48కరీంనగర్ 72.54ఖమ్మం 76.09మహబూబాబాద్ 71.85మహబూబ్‌నగర్ 72.43మల్కాజ్‌గిరి 50.78మెదక్ 75.09నాగర్‌కర్నూలు 69.46నల్గొండ 74.02నిజామాబాద్ 71.92పెద్దపల్లి 67.87సికింద్రాబాద్ 49.04వరంగల్ 68.86జహీరాబాద్ 74.63నర్సాపూర్ అసెంబ్లిd సెగ్మెంట్‌లో 84.25శాతం పోలింగ్ నమోదై మొదటి స్థానంలో నిల్చింది.
మలక్‌పేట్ అసెంబ్లి సెగ్మెంట్ పరిధిలో కేవలం 42.76శాతంతో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఓటర్లు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్న పెద్ద నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నిలిచి 3,85,149మంది ఓటర్లు ఇక్కడ ఓటేశారు.
అత్యల్ప సంఖ్యలో ఓటర్లు భద్రాచలం నియోజకవర్గంలో 1,05,383 మంది పోలింగ్‌లో పాల్గొని ఓటేశారు. అయితే ఎండ తీవ్రత, వరుస సెలవులు ఉన్నప్పటికీ ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల కారణంగానే హైదరాబాద్ మినహా రాష్ట్రమంతటా పోలింగ్ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు, సిబ్బందికి, అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఈవీఎంలను భద్రపర్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల 4న రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 34 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతందని తెలిపారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48శాతం నమోదైనట్లు ప్రకటించారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 84.25శాతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 42.76శాతం నమోదైందని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3శాతం పోలింగ్ పెరిగిందన్నారు.
జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో 74.03శాతం, చేవెళ్లలో 56.40, కరీంనగర్‌లో 72.54, ఖమ్మంలో 76.09శాతం, మహబూబాబాద్‌లో 72.43శాతం, మల్కాజ్‌గిరిలో 50.78శాతం, మెదక్‌లో 75.09శాతం, నాగర్ కర్నూల్‌లో 69.46శాతం, నల్గొండలో 74.02శాతం, నిజామాబాద్‌లో 71.92శాతం, పెద్దపల్లిలో 67.87శాతం, సికింద్రాబాద్‌లో 49.04శాతం, వరంగల్‌లో 68.86శాతం, జహీరాబాద్‌లో 74.63శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 51.61శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు