Monday, November 25, 2024

TS : యాద‌గిరిశుని క్షేత్రంలో… కిక్కిరిసిన భ‌క్త‌జ‌నం

వేస‌వి సెలవులు ముగుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలకు భ‌క్తుల తాకిడి నెల‌కొంది. ఇవాళ ఆదివారం కావ‌డంతో యాద‌గిరిశున్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం కాగా.. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ రుసుముతో దర్శనానికి 2 గంటల సమయం ప‌డుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

అయితే.. శనివారం ఆలయ ఆదాయం రూ.62,55,860. ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,15,350, వీఐపీ టిక్కెట్ల ద్వారా రూ.16.20 లక్షలు, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి సుప్రభాత విరామాన్ని చూసేందుకు కూడా భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉండగా కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు కిక్కిరిసిపోవడంతో భక్తులు మెట్ల మీదుగా కొండపైకి చేరుకుంటున్నారు. అదేవిధంగా కొండపైన కార్ పార్కింగ్ లేకపోవడంతో దిగువన పార్కింగ్ చేస్తున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆదిదంపతుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని, ఈరోజు, రేపు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement