సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న స్టూడెంట్స్ ను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు యాజమాన్యం. దీంతో ఆప్రాంతం అంతా రోదనలతో మిన్నంటాయి. కడుపు పట్టుకుని ఏడుస్తూ పిల్లలు కనిపించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత జరగుతున్నా యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వార్త కూడా కుటుంబ సభ్యులకు సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.