Thursday, January 9, 2025

NZB | క్యూఆర్ కోడ్ తో ఫీడ్ బ్యాక్.. పోలీసుల సేవలపై అభిప్రాయాల సేకరణ

  • పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుకు చర్యలు
  • జనవరి 9న రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ప్రారంభం
  • ప్రకటనలో వెల్లడించిన ఇన్చార్జి సీపీ సింధు శర్మ


నిజామాబాద్ క్రైమ్, జనవరి 8 (ఆంధ్రప్రభ) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ప్రజలకు చేరువయ్యేందుకు, తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారు తమ మొబైల్‌ ద్వారా ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన వెంటనే పోలీసు సేవల పట్ల ఎంత వరకు సంతృప్తి చెందారు ? పోలీసుల పనితీరుపై ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దారులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో అందుకోసం క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ QR కోడ్ పద్దతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9న రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ప్రారంభించనున్నట్లు బుధవారం ఇంచార్జ్ సీపీ సిహెచ్.సింధుశర్మ వెల్లడించారు. ఈ QR కోడ్ వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారని, ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు QR కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి సీపీ కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement