Thursday, September 19, 2024

TS | రిజర్వేషన్ చేసుకుంటే ఫీజు మినహాయింపు : ఆర్టీసి ఎండి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభ వార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు ఎనిమిది రోజులు ముందుగానే బుకింగ్‌చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజును మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎంపీ సజ్జన్నార్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ్‌ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్‌ ఛార్జీలను మినహాయిస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. ్‌ ట్విట్టర్‌ వేదికగా ఎండీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement