హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ ప్రకటించింది. కాగా, నేడు యంగ్ లియూ జన్మదినం కావడంతో కెసిఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్ష మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి – లక్ష మందికి ఉద్యోగాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement