Tuesday, December 3, 2024

TS : ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి

తిమ్మాపూర్, ప్ర‌భ‌న్యూస్ః క‌రీంన‌గ‌ర్ జిల్లాలో విషాధం నెల‌కొంది. ఈత‌కు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందారు. ఈఘ‌ట‌న తిమ్మాపూర్ మండలం వచ్చునూరులో ఇవాళ‌ ఉద‌యం చోటుచేసుకుంది.

- Advertisement -

వచ్చునుర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు గుండ్లపల్లి లోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రవీందర్ రెడ్డి ఆయన కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement