తండ్రి చేతితో తనయుడు హతమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ పరిధిలోని మునగనూరు రామానుజ కాలనీకి చెందిన వినయ్‌కుమార్ మద్యానికి బానిసై తండ్రిని రోజు వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో మద్యం సేవించి తాను వ్యాపారం చేయాలనుకుంటున్నానని 20లక్షలు కావాలంటూ అర్థరాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రుక్తుడైన తండ్రి పారతో కొడుకును తలపై బాదాడు. దీంతో వినయ్‌కుమార్ అక్కడిక్కడే మృత్యవాతపడ్డాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.