Tuesday, January 7, 2025

Medchal | ఘోర ప్రమాదం.. బైక్ ఢీకొన్న లారీ, ముగ్గురు మృతి !

మెడికల్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించి స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement