Wednesday, November 27, 2024

TG | కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రావొద్దు : మంత్రి తుమ్మల

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడారు.

రైతులకు అన్ని రకాల ఏర్పాట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వేగంగా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.

తూకంలో ఎలాంటి అవకతవకలకు జరగకుండా చూడడడంతోపాటుకొనుగోళ్ల తాలూకు చెల్లింపులు సకాలంలో నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటు-లో ఉండాలని ఆదేశించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement