Saturday, November 23, 2024

కూర‌గాయ‌ల పంట‌ల వైపు రైతుల‌ను ప్రోత్స‌హించాలి : హ‌రీశ్ రావు

ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు, పండ్లు, కూరగాయల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా ల‌క్ష్మ‌ణ్ ఉద్యాన వ‌ర్సిటీ ఏర్పాటు చేసి ఏడేండ్లు అయిన సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. గ‌త ఏడేండ్ల‌లో కనుగొన్న కొత్త అంశాలు, ప‌రిశోధ‌న‌ల‌ను ప్ర‌ద‌ర్శించగా, ప‌రిశోధ‌న విభాగాల ప్ర‌ద‌ర్శ‌న శాల‌ను హ‌రీశ్‌రావు సంద‌ర్శించారు. అలాగే ఉద్యాన వ‌ర్సిటీ సాధించిన ప్ర‌గ‌తిపై సుద్దాల అశోక్ తేజ ర‌చించిన ప్ర‌త్యేక గీతాన్ని మంత్రి విడుద‌ల చేశారు. వ‌ర్సిటీ పండించిన పంట‌ల విక్ర‌యాల‌కు ట్రేడ్ మార్క్ ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివ‌ర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతుల‌ను ప్రోత్సహించాలని సూచించారు. రైతుల ఖర్చులు తగ్గి లాభాలు వ‌చ్చే వంగడాలను అభివృద్ది చేయాలని హ‌రీశ్‌రావు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement