Wednesday, November 20, 2024

Farmer’s Sarkaar – దేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది – కెసిఆర్

నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం.. అట్టహాసంగా జరిగింది. గాందీబాగ్‌లో ఏర్పాటుచేసిన పార్టీ ఆఫీసులో. పార్టీ నేతలతో కలిసి గులాబీ జెండా ఆవిష్కరించారు కేసీఆర్‌. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ తుపాన్‌లా దూసుకెళ్తోందన్నారు. ఇప్పటికే లక్షల మంది తమ కమిటీల్లో చేరారని చెప్పారు. ఎవరికి పడితే వారికి కాదు… రైతులకు, యువతకు అవకాశమిస్తామని చెప్పారు .

బీజేపీ టార్గెట్‌గా పరోక్ష విమర్శలు చేశారు కేసీఆర్‌. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ధర్మం పేరిట, జాతీయవాదం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలుకుతామన్నారు . దేశంలోని సామాన్య ప్రజల దగ్గర ఆలోచనా బాంఢాగారం ఉందనీ… ఎమర్జెన్సీ సమయంలో వారి తీర్పును స్పష్టంగా చూశామని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. అదనుకోసం జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు .దేశంలో పరివర్తన కోసం.. బీఆర్‌ఎస్‌ ఒక మిషన్‌లా పనిచేస్తుందన్న ఆయన.. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనేది కేవలం నినాదం కాదనీ, అది నిర్ధారణ అని స్పష్టం చేశారు. ముంబై, నాందేడ్‌ సహా కీలక నగరాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభించుకుని.. మరింత క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement