వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యంకు రైతులు నిప్పంటించారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో రైతుల ధర్నా చేశారు. సారంపల్లిలో సిరిసిల్ల- సిద్దిపేట ప్రధాన రహదారిపై వడ్లకు నిప్పంటించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరిగారు. రైతు ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
నెలరోజుల క్రితమే వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటివరకు వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం చేశారు. వానాకాలం వడ్లను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతుల నిరసన సెగలు తప్పని రైతుల హెచ్చరించారు. వెంటనే ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..