జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా బాధిత రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నర్సింగాపూర్ లో ముగ్గులు వేసి రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ నుంచి గ్రామాన్ని తీసివేయాలని రైతులు కోరుతున్నారు. పండుగ తర్వాత ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు. మరోవైపు తిమ్మాపూర్ లో భోగి మంటల్లో మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రీక్రియేషన్ జోన్ నుంచి తమ వ్యవసాయ భూములను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం మోతెలో అధికారులు ఏర్పాటు చేసిన పెట్టెలో రైతులు వినతిపత్రాలు వేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement