Friday, November 22, 2024

యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

పరిగి డిసెంబర్ 2 ( ప్రభ న్యూస్) : వచ్చే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సూచించారు. మండల పరిధిలోని గడి సింగపూర్ రైతు వేదికలో యాసంగిలో పంటల నమోదు, పంటల మార్పిడి విధానం పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రానున్న యాసంగిలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతుల లాభసాటి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా వేరుశనగ, శనగ, నూనె గింజలు, నువ్వులు, బెబ్బర్ లు, మినుములు, ప్రొద్దుతిరుగుడు, పెసలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు.

ఆరుతడి పంటలతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని ఆయన సూచించారు. వచ్చే యాసంగిలో తప్పనిసరిగా లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువుల వాడకంతో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఉంటాయని సూచించారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు పంటల సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు స్థానిక సర్పంచ్ అశోక వర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పద్మమ్మ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఏడీఏ రాధిక, వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ స్రవంతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement