Tuesday, September 17, 2024

TG: రైతుల‌కు మేలు జ‌రిగింది.. నా జ‌న్మ ధ‌న్య‌మైంది..

రైతుల ఖాతాల్లో ₹12,289 కోట్లు జ‌మ‌
సంతోషం వ్య‌క్తం చేసిన సీఎం రేవంత్‌
రుణ‌మాఫీ రెండో విడ‌త నిధులు విడుద‌ల‌
రైతు ప్ర‌యోజ‌నాలే ముఖ్యమన్న సీఎం రేవంత్‌
10.84 ల‌క్ష‌ల‌ మంది రైతుల‌కు రుణ‌మాపీ వ‌ర్తింపు
రూ.ల‌క్ష‌న్న‌ర లోపు రుణాలన్నీ మాఫీ
ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోస‌మే ఆలోచ‌న
పేద‌ల‌కు మేలు కోస‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వ
ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కంటే రైతు ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద రెండో విడ‌త రుణ‌మాఫీ నిధుల‌ను విడుద‌ల చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులున్నా రెండో విడ‌త రుణ‌మాఫీ చేశామ‌న్నారు. రుణ‌మాఫీ చేయ‌డంతో త‌మ జ‌న్మ ద‌న్య‌మైంద‌న్నారు. ఎంత న‌ష్టం వ‌చ్చినా రైతులు వ్య‌వ‌సాయం వ‌ద‌ల‌డం లేద‌ని గుర్తు చేశ‌రు. రైతుల‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం రుణ‌మాఫీ దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

రాహుల్ సంక‌ల్పమే…
రైతు రుణ‌మాఫీ రాహుల్ గాంధీ సంక‌ల్ప‌మే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం రుణ‌మాపీ చేశామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధిని ఎవ‌రూ సంకించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల ప‌క్షమే అని నిరూపించింద‌ని చెప్పారు. పంట‌ల బీమా, ఆహార భ‌ద్ర‌త ప‌థ‌కాలు అమ‌లు చేసింది కాంగ్రెస్ అని అన్నారు. బ్యాంకుల‌తో వ‌న్‌టైమ్ కాదు ఫుల్‌టైమ్ సెటిల్‌మెంట్ చేశామ‌న్నారు. అలాగే ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తామ‌న్నారు.

ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోస‌మే ఆలోచ‌న‌ : భ‌ట్టి
త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తి నిమిషం ప్ర‌జ‌ల కోస‌మే ఆలోచిస్తోంద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. రూ.రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫీ సాధ్యం కాద‌న్న నోరులు మూయించి అమ‌లు చేశామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం రైతుల ప‌క్ష‌పాతి అన్నారు. ఈ రోజు రూ.ల‌క్ష‌న్న‌ర రుణాల‌ను మాఫీ చేశామ‌ని తెలిపారు. రాహుల్ సంక‌ల్పం వ‌ల్లే రుణ‌మాఫీ అమ‌లు చేశామ‌న్నారు.

- Advertisement -

రూ.12,289 కోట్లు రుణ‌మాఫీ..
ఈరోజు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రూ. 12,289 కోట్లు రైతుల ఖాతాలో జ‌మ చేశామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. సుమారు 10.84 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.ల‌క్ష‌న్న‌ర రుణ‌మాఫీ వ‌ర్తించింద‌న్నారు. ఆగ‌స్టులోగా మూడో విడ‌త రుణ‌మాఫీ అవుతుంద‌ని చెప్పారు. జిల్లాల వారీగా రుణ‌మాఫీ వివ‌రాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ఉత్త‌మ కుమార్, రాజ‌న‌ర్సింహ‌, సీత‌క్క, శ్రీ‌ధ‌ర్‌బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా…
జిల్లాల వారీగా చూస్తే… నల్లగొండ జిల్లాలో 51వేల 515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు , నాగర్ కర్నూల్ జిల్లాలో 32వేల 406 రైతుల ఖాతాల్లో 312 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 27వేల 249 రైతులకు 286 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 27వేల 875 రైతులకు 277 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 26వేల 437రైతులకు 250 కోట్లు ప్ర‌భుత్వం జ‌మ చేసింది. ఖమ్మం జిల్లాలో 33వేల 942రైతులకు 262 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 24వేల ఏడుమంది రైతులకు 229 కోట్లు, మెదక్ జిల్లాలో 22వేల 850మంది రైతులకు 216 కోట్లు, వికారాబాద్ జిల్లాలో 23వేల 912మంది రైతులకు 240 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో 22వేల 253మంది రైతులకు 219 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 23వేల 769మంది రైతులకు 219 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 21వేల 785మంది రైతులకు 207 కోట్లు జ‌మ చేసింది. కామారెడ్డి జిల్లాలో 24వేల 816మంది రైతులకు 211 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18వేల 728మంది రైతులకు 196 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18వేల 127మంది రైతులకు 177 కోట్లు విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలో 17వేల 903మంది రైతులకు 169 కోట్లను రుణమాఫీ కింద ప్ర‌భుత్వం జ‌మ‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement