రాహుల్ గాంధీ బోగస్ మాటలను రైతులు నమ్మే స్ధితిలోలేరని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శనివారం మంత్రి ఎర్రబెల్లి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణ మాఫీ చేశారా..? మీరు అధికారం వున్నప్పుడు రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదు..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధిహామీ పతాకాన్ని వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయలేదని అడిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు అనేక పధకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు ? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ధాన్యం కొనకపోవడం వల్లే తెలంగాణకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు. చెరుకు పరిశ్రమలు మూసేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..? పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే. ధరణి ఒక సక్సెస్ స్కీంఅని నకిలీ విత్తనాల సృష్టికర్తలే మీరేనని ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement