Wednesday, September 18, 2024

TG: వైరాలో రైతాంగ సదస్సు చరిత్రలో నిలిచిపోవాలి.. మంత్రి తుమ్మ‌ల‌

ఆగస్టు 15న వైరాలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయండి
సీఎం చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్ లు ప్రారంభం

వైరా, ఆగస్టు 5 (ప్రభ న్యూస్): ఈనెల 15న‌ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ మూడు పంపు హౌస్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం వైరాలోని ముఖ్యమంత్రి బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో తుళ్లూరి కోటేశ్వరరావు పామాయిల్ తోట ప్రక్కన జరిగే సభాస్థలిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైరాలో జరిగే వ్యవసాయ రైతాంగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాల్గొని సభను విజయవంతం చేయనున్నట్లు ఆయన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వలన లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కృష్ణాజ‌లాలు, గోదావరి జలాలు రావడం వలన ఈ ప్రాంత రైతాంగం భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రుణమాఫీ, సంబరాలను వైరాలో జరుపుతామని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో జాతీయ, రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ రైతాంగ సదస్సు రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా జరుపుతామని, లక్ష మంది రైతులతో జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పూ వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా ఏసీపీ యం ఏ రహమాన్, మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, మచ్చ వెంకటేశ్వరరావు, పాలేటి నరసింహారావు, శ్రీరామనేని విజయ భాస్కర్, పొదిలి హరినాథ్, బోల్ల గంగారావు, మిట్టపల్లి నాగి, సూర్యదేవర శ్రీధర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement