ఎల్లారెడ్డి: (ప్రభ న్యూస్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ తండా వద్ద ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, నిరసన వ్యక్తం చేశారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తెచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు మూడు లారీల ధాన్యం మాత్రమే తూకం వేశారన్నారు. ధాన్యం తూకం వేసి 5 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు లారీలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో గన్ని ధాన్యం బస్తాలు తడిచిపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందారు.లారీలు అందుబాటులో లేదని అధికారులు సాకులు చెబుతున్నారని పేర్కొన్నారు.రైతులకు పట్టించుకునే నాథుడే కరువయ్యారాని అధికారులపై,ప్రభుత్వంపై మండిపడ్డారు.వెంటనే తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించేందుకు లారీలు పంపాలని డిమాండ్ చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ప్రధాన రహదారిపై రైతులు సుమారు గంటన్నర పాటు ధర్నా చేశారు.విషయం తెలుసుకున్న తహశీల్దార్,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి,నచ్చచెప్పి హామీ ఇచ్చారు. దాంతో రైతులు ధర్నా విరమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement