రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషనరెడ్డి అన్నారు. తులేకలన్ గ్రామానికి చెందిన రైతులు బర్రె జంగయ్య , జక్కుల ఆంజనేయులు గార్లు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులకు రూ. 5,10 లక్షల చొప్పున రైతుబీమా చెక్కులను అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందన్నారు.ఈ పథకాన్ని అరుహులైన ప్రతి రైతు వినియోగించుకోవాలని అన్నారు. రైతు చనిపోయేనట్లుయీతే .మరణించిన పది రోజులలోపు అభ్యర్థికి ఐదు లక్షల రూపాయలు భీమా పొందవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి,సర్పంచ్ చిలుకల యాదగిరి,ఎంపిటిసి నాగటి నాగమణి, మండల అధ్యక్షులు చిలుకల బుగ్గ రాములు,నియోజకవర్గ తెరాస యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు,వార్డు సభ్యులు కృష్ణ,గ్రామశాఖ అధ్యక్షులు యాదగిరి,తెరాస నాయకులు వీరయ్య,వెంకటేష్, మహేందర్,భాష,రవి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.