Monday, December 2, 2024

MBNR | కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 2(ఆంధ్ర ప్రభ) : వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఆవరణ వద్ద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డి 4ఎకరాల భూమిని… అన్నదమ్ములు సాగు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ గతంలో పలుమార్లు ప్రజావాణిలో విన్నవించుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురైన రైతు సాయిరెడ్డి వనపర్తి కలెక్టరేట్ ఆవరణ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అతనికున్న 4ఎకరాల భూమిని అన్నదమ్ముళ్లు సాగు చేయకుండా అడ్డుకోవడంతో, పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రత్నించాడు. అనంతరం ప్రజావాణి జరుగుతుండగా అక్కడికి వెళ్ళాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పోలీసులకు చెప్పడంతో ఆ రైతును చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సాయిరెడ్డికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ప్రజావాణిలో భూ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement