తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలపై రైతులు సంతోషంగా ఉన్నారు. బీఆర్ ఎస్ సర్కారుకు తమ సపోర్టు ఉంటుందని తెలియజేస్తూ పంటపొలాల్లో వరినారుతో బీఆర్ ఎస్ లోగోలను క్రియేట్ చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు, లక్ష రూపాయల రుణమాఫీ వంటి పథకాలతో వ్యవసాయ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.
సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేసేలా చేపట్టిన పథకాలపై సంతోషం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం రైతు పంట పొలంలో వరినాటును వేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు సీఎం కేసీఆర్‌పై, బీఆర్ ఎస్ పార్టీపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తూ కత్తెరశాల గ్రామానికి చెందిన యువరైతు తుపాకుల సంతోష్ తన పొలంలో వరినాట్లతో “జై బీఆర్ఎస్” అని నాటి పార్టీ తో పాటు సీఎం కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణలో రైతులు రాజుగా మారారని సంతోష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.