రాజకీయ నాయకులకి కండువాని మార్చినంత ఈజీగా పార్టీలు మారుతుండటం చూస్తూనే ఉన్నాం. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని రకాలుగా బలంగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకి బలాన్ని చేకూరుస్తూ పొంగులేటి కుమారై పెళ్లి ..రిసెప్షన్ వేడుకలకు టిఆర్ ఎస్ నేతలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీటికి తోడు బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి వివాహ రిసెప్షన్ కి హాజరైన తీరు చూస్తేనే పొంగులేటి తదుపరి అడుగులు బిజెపి వైపే అనే వార్తలు వస్తున్నాయి. పొంగులేటి కూతురు రిసెప్షన్ వేడుకకు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, గడ్డం వివేక్, ఎమ్మెల్యే రఘునందన్ రావులు హాజరయ్యారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని .. ఈటల రాజేందర్ బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటి కూతురు ఎంగేజ్‌మెంట్ రోజున బీజేపీ నేతల హడావిడి కొనసాగినట్లే.. రిసెప్షన్ రోజున కూడా సేమ్ సీన్ పునరావృతం అయ్యేసరికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అనే ప్రచారం కొనసాగుతోంది. మరి ఈటెల లాగా పొంగులేటి కూడా టిఆర్ ఎస్ కి షాక్ ఇస్తారేమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement