Friday, November 22, 2024

Qu Dongyu: కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌ని సందర్శించిన ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్

హైదరాబాద్ : ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ క్యూ డోంగ్యు, ఎఫ్ఏఓ ప్రతినిధి బృందంతో కలిసి కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌ని సందర్శించారు. ఈ పర్యటన ఉద్దేశ్యం కంపెనీ అడ్వాన్స్‌డ్ జెనోమిక్స్ లాబొరేటరీని గమనించి, దాని కొనసాగుతున్న బయోటెక్ ప్రోగ్రామ్‌లను గురించి తెలుసుకోవటం. డాక్టర్ క్యూ డోంగ్యుతో పాటుగా ఎఫ్ఏఓ ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరిలో డైరెక్టర్ జనరల్‌కు అసిస్టెంట్ అయిన ఎడ్ హెచ్ఈ షియోగ్, భారతదేశంలో ఎఫ్ఏఓ ప్రతినిధి ట‌క‌యుకి హగివారా, కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ స్పెషలిస్ట్ లిల్లీ పాల్, ఎఫ్ఏఓఆర్ (ప్రోగ్రామ్) కొండ చవ్వా, ఐటీ స్పెషలిస్ట్ దీపేష్ సోలంకి వున్నారు.

ఈ పర్యటనలో కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.భాస్కర్ రావు, డాక్టర్ క్యూ డోంగ్యు, ఎఫ్ఏఓ ప్రతినిధులకు కంపెనీ గురించిన సమగ్ర సమాచారం అందించారు. ఈసంద‌ర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ… కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌కి ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డోంగ్యు సందర్శన భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రతను పెంపొందించడంలో సంస్థ కీలక పాత్రకు పెరుగుతున్న గుర్తింపును సూచిస్తుందన్నారు. 75 మిలియన్లకు పైగా భారతీయ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే తమ మిషన్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement