హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్కు వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు . సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మన్మాడ్ (అజంతా ఎక్స్ప్రెస్) రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. సికింద్రాబాద్ – తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్(వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించారు.
ఇది ఇలా ఉంటే పలక్ నుమాలోని 18 బోగీలలో మూడు బోగీలు బూడిద కాగా, మరో నాలుగు బోగీలు పాక్షికంగా కాలిపోయాయి.. 11 బోగీలతో రైలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సికింద్రాబాద్ కు చేరుకుంది.. అలాగే కాలిపోయిన బోగీల ప్రయాణీకులను బస్సులలో సికింద్రాబాద్ కు చేర్చారు.. ప్రమాద స్థలాన్ని రైల్వే జనరల్ మేనేజర్, జిల్లా కలెక్టర్ సత్పతి పరిశీలించారు..ప్రయాణీకులందరూ సురక్షింతంగా ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు..
ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.. వారికి సాధారణ పోలీసులు సహకరిస్తున్నారు.. ప్రమాదంపై డిజిపి అంజనీకుమార్ ట్విట్ చేశారు.. మొత్తం ఏడు బోగీలు కాలినట్లు పేర్కొన్నారు.. ప్రమాదకారణాలను తమవైపు నుంచి దర్యాప్తు చేస్తునట్లు వెల్లడించారు..