Thursday, November 21, 2024

Cyber: కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ … క్రౌడ్ ఫండింగ్ నిందితుడి అరెస్ట్

కాంగ్రెస్ పార్టీ పేరునూ సైబర్ కేటుగాళ్లు వదల్లేదు. ఆ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. క్లౌడ్‌ఫండింగ్‌ వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అటువంటి అంతర్రాష్ట్ర మాయగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీలుసు అరెస్టు చేశారు.

నగర సీసీఎస్‌ జాయింట్‌ సీపీ ఏ.వి.రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌదరి డొనేట్‌ ఐఎన్‌సీ.కో.ఇన్‌ పేరుతో ఈ నకిలీ వెబ్‌సైట్‌ ప్రారంభించాడు. సేవా కార్యక్రమాలకు నిధులు సేకరిస్తున్నట్లు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ వెబ్‌సైట్‌ను ప్రమోట్ చేసేవాడు. దీనికోసం అతడు కాంగ్రెస్‌ లోగోను ఉపయోగించుకొని క్లౌడ్‌ఫండింగ్‌ వసూలు చేపట్టాడు. దీనిపై ఈనెల 10న తెలంగాణ పీసీసీ నేతలు హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడు రాజస్థాన్‌కు చెందిన సురేంద్ర చౌదరిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement