Friday, November 22, 2024

Arrest: న‌కిలీ పాస్ పోర్టులు – స్పెష‌ల్ బ్రాంచ్ ఇన్ స్పెక్ట‌ర్ అరెస్ట్ ….

భీంగల్‌లో నకిలీ పాస్ పోర్టులు, పత్రాల కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని అరెస్ట్ చేసిన సిబిసిఐడి పోలీసులు తాజాగా మ‌రోక‌రిని మంగ‌ళ‌వారం తెల్లావారు ఝామున అరెస్ట్ చేశారు.. మాక్లూర్, నవీపేట ఎస్బీ ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్‌ను మంగళవారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

సోమ‌వారం నాడు భీంగల్ మండల కేంద్రంలో సీబీసీఐడీ టీం సుమారు గంటన్నర పాటు ముచ్కూర్ రోడ్డులో గల నకిలీ పాస్ పోర్టుల కేసు నిందితుడు సుభాష్ ఇంట్లో సోదాలు నిర్వహించి అతని వద్ద నుండి ల్యాప్ టాప్, ఇతర విలువైన సమాచారం పత్రాలు, నకిలీ పాస్ పోర్టు ల‌ను స్వాధీనం చేసుకొన్నారు. అనంత‌రం సుభాష్ ఇచ్చిన స‌మాచారంతో నేటి తెల్ల‌వారుఝామున గంగస్థాన్‌లో ఎస్బీ ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశారు… అత‌డిని అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

దీంతో భీంగల్ కేంద్రంగా లైసెన్స్‌లు లేని ట్రావెల్స్ నిర్వాహకుల్లో భయాందోళన మొదలైంది. గతంలో పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లే కార్మికులే టార్గెట్‌గా నకీలీ పత్రాలను సృష్టించి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ల‌క్ష్మ‌ణ్ అరెస్ట్ తో నకిలీ పాస్ పోర్టుల వ్యవహారం ఎక్కడ బైట పెడతాడోనాన్న భయందోళనలు ప్రారంభమయ్యాయి. భీంగల్‌లో సీఐడి సోదాలతో గ‌త మూడు రోజుల నుంచి ట్రావెల్స్ దుకాణలను మూసి వేశారు.. ఇక ఎస్బి ఏఎస్సై లక్ష్మణ్ అరెస్ట్‌తో నకీలి పాస్ పోర్ట్ వ్యవహారంలో తల దూర్చిన మరింత మంది ఎస్బి అధికారుల, నకీలి పత్రాలు, పాస్ పోర్టుల ఎజెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నకీలి పత్రాలు, గతంలో బోధన్ కేంద్రంగా రోహింగ్యాల పాస్ పోర్టుల వ్యవహారంతో పాటు ఇతర నకిలీ పత్రాలు, పాస్ పోర్టుల జారీ వ్యవహారంలో పాలు పంచుకున్న అధికారులు, ఏజెంట్లు అందరి బాగోతం బయట పడ్డట్లు స‌మాచారం.. దీంతో మ‌రికొంత‌మందిని అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు రంగం సిద్ధం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement