హైదరాబాద్, : బోధన్ పాస్‌పోర్ట్ కేసులో దేశం దాటి పోయిన 19 మంది నింది తులను గుర్తించామని, ఇంకా 49 మంది జాడ తెలుసు కునేందుకు దర్యాప్తు చేస్తున్నామని సైబరా బాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ రాకెట్‌కు సంబంధించి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గత నెల 24న సంజీవ్ దత్త, రామూదాస్, మండల్ సందిప్ అనే ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు దుబాయి వెళ్లేందుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయానికి వచ్చారు. రాత్రి 10.40 గంటలకు ఎఫ్‌జెడ్-8426 అనే విమానం ఎక్కేందుకు ప్రయత్ని స్తున్న క్రమంలో వారి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమా చార మిచ్చారని తెలిపారు. దాంతో ముగ్గురిని అదుపు లోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం రాకెట్ వెలుగు లోకి వచ్చిందన్నారు.ఈ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 8మంది నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నారని తెలిపారు. స్థానికంగా ఉండే మీ సేవా నిర్వాహకుడు మతీన్ ద్వారా నకిలీ ఆధార్ కార్డులు పొంది, వాటి ద్వారా పాస్‌పోర్టులు సంపాదిం చారని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 72 మంది పాస్‌పోర్టులు పొం దారని వెల్లడించారు.
సముద్ర మార్గం ద్వార ఇండియాకు.
ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన నిందితుడు పరిమళ్బైన్ 2013లో సముద్ర మార్గం ద్వారా ఇండియాకు అక్రమంగా వచ్చాడు. కొద్ది రోజులు పశ్చమ బెంగాల్లో ఉండి, ఆ తర్వాత 2015లో బోధన్ వచ్చాడు. అదే తరహాలో అక్రమంగా ఇండి యాకు వచ్చి ఆయుర్వేద డాక్టర్‌గా సమీర్ అనే వ్యక్తి బోధన్‌లో స్థిర పడ్డాడు. పరిమళ్ సమీర్ దగ్గర ఆయు ర్వేద డాక్టర్‌గా శిక్షణ పొంది సొంతగా ప్రాక్టీస్ పెట్టారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మతీన్ ద్వారా సొంతగా ఆధార్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ సంపా దించాడు. దాంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండి యాకు వచ్చిన తన ప్రాంతం వారికి బోధన్‌తోపాటు పశ్చిమబెంగాల్లో తనకున్న పరిచయాలతో ఆధార్ కార్డులు ఇప్పించాడు. బోధన్‌లో12 మందికి, పశ్చిమ బెంగాల్లో 60 మందికి ఆధార్ కార్డులు ఇప్పించాడని తెలిపారు.
బోధన్ కేంద్రంగా నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు పొందిన కేసులో ఎస్బీ అధికారులు చేతి వాటం చూపించారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసు కున్న వారి నుంచి వెరిఫికేషన్ సందర్భంగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.10 వేల నుంచి, రూ.30 వరకు లంచంగా తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐ మల్లేశ్ రావు 42, ఏఎస్ఐ అనిల్ కుమార్ 30 పాస్‌పోర్టులను ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా డబ్బులు తీసు కుని రికమండ్ చేశారని తెలిపారు. ఒకే అడ్రస్‌పై 32 పాస్‌పోర్టులు పొందారని తెలిపారు.
మూడేండ్లలో 82 మంది అరెస్ట్
మూడేండ్ల కాలంలో నకిలీ పాస్‌పోర్టులతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై 32 కేసులు నమోదు చేసి, 82 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. 25 మంది ఏజెంట్లు, ముగ్గురు పోలీసులతో పాటు ఒక ఇమ్మిగ్రేషన్ అధి కారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ పోలీసులు, విమానాశ్రయ అధికారులు సమన్వ యంతో పని చేసి అనేక అక్రమాలను వెలికి తీసి నట్టు అయన వెల్లడించారు.
పాస్ పోర్టు కేసులో దేశం దాటిన 19 మంది…
Advertisement
తాజా వార్తలు
Advertisement