వరంగల్ – దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న
మూడు ముఠాలోని 11 మంది సభ్యులతో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని ఫోర్స్ పోలీసులు గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. ఈ కేసుల వివరాలను వరంగల్ సిపి రంగనాథ్ మీడియాకు వివరించారు. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు 57 లక్షల విలువైన నకిలీ , గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయానాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీలు బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారు, స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులు, 3లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందులు ఉన్నాయి..
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ గత నెల 24వ తేదిన పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, గీసుగొండ మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కల్పి గీసుగొండ మండలం, మంగళ తండాలోని నిందితుడు ఇస్లావత్ వెంకటేశ్, సునవత్ వీరన్న నిర్వహిస్తున్న పురుగు మందుల విక్రయ షాపులో తనీఖీలు నిర్వహించారు. అతడి ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేశారుపోలీసులు.. వారి నుంచి 24 లక్షల రూపాయల విలువగల గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పురుగు మందుల విక్రయాలు
నర్సంపేట ప్రాంతంలో నకిలీ పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు వ్యవసాయ అధికారుల కల్సి మహేశ్వం గ్రామంలోని తండాలో నివాసం వుంటున్న నిందితుడు భుక్యా మాత్రు రాథోడ్ ఇంటిపై పోలీసులు దాడులు జరపగా, ఈ దాడిలో అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఎలాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇంటిని పురుగుల మందులు తయారీ కేంద్రంగా మార్చివేయడంతో నర్సంపేట, పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందుల తయారీ భాగంగా పెద్ద, పెద్ద డమ్ముల్లో రసాయాలు, పౌడర్లు మిశ్రమాల ద్రావణాన్ని కలిపి వాటిని లీటర్, ఆర లీటర్ డబ్బాల్లో నింపి వాటిపై వివిధ కంపెనీల పేర్లతో ఏవరికి అనుమానం రాకుండా ఆకర్షణీయమైన లేబుళ్ళను అతికించి రైతులకు విక్రయించేవాడన్నారు. ఈ నకిలీ పురుగు మందులు తయారీ అవసరమయిన ముడి సరుకును హైదరాబాద్లో కోనుగోలు చేస్తున్నట్లుగా నిందితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఈ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందులతో పాటు బయో ఉ తదకాలు తయారీ చేస్తున్న మల్టీకెమ్ ఆగ్రో ఇండస్ట్రీపై దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు వారి నుండి సూమారు 26లక్షల 50వ వేల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులతో పాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో సంఘటనలో పోలీసులు చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న మరో నిందితుడు హనుమాండ్ల భాస్కర్ అరెస్టు చేసి విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని కుంట్లూరు గ్రామం, అబ్దుల్లాపూరమెట్లో బయో ఉత్పాదాకాలు తయారీ ముసుగులో నకిలీ పురుగు మందుల విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ బయోటెక్ కంపెనీపై వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి కంపెనీ యజమాని మాడితటి శేఖర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకోని మూడు లక్షల 50వేల విలువైన నకిలీ పురుగు మందులతో తయారీకి వినియోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా ఐనవోలు మండలం, నందనం గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గలైఫోసటే అనే గడ్డి మందును విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ అధికారులు నందన గ్రామంలోని శ్రీ సోమేశ్వర ఎరువులు మరియు పురుగు మందుల విక్రయ దుకాణంపై దాడులు నిర్వహించి సుమారు మూడులక్షల 53వేల రూపాయల విలువైన నిషేధిత గలైఫోసటే గడ్డి మందును స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వహకులైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది.
రైతులను మోసం చేస్తు నకిలీ, గడువు తీరిన పురుగు మందుల విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళను. పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపిలు మధుసూదన్, జితేందర్ రెడ్డి, ఇన్సెస్పెక్టర్లు శ్రీనివాస్ రావు, అల్లం రాంబాబు, బాబూలాల్,పవన్ కుమార్, పెండ్యాల దేవేందర్, ఎస్.ఐలు నరసింహరావు, వంశీకృష్ణ, శరత్ కుమార్, లవన్ కుమార్, నిస్సార్పాషా, ఏఏఓ సల్మాన్పషా, టాస్క్ఫోర్స్ హెడాకానిస్టేబుళ్ళు అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు, శ్రీనివాస్, ప్రభాకర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, భిక్షపతి, రాజు, శ్యాంసుందర్, సురేష్, మహబూబాషా, కరుణాకర్, శ్రీధర్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ తిరుమల్ పాల్గొన్నారు.