Home తెలంగాణ‌ ఆదిలాబాద్ ADB | రామాయి గ్రామీణ బ్యాంక్ దోపిడీకి విఫల యత్నం..

ADB | రామాయి గ్రామీణ బ్యాంక్ దోపిడీకి విఫల యత్నం..

0
ADB | రామాయి గ్రామీణ బ్యాంక్ దోపిడీకి విఫల యత్నం..

అలారం సైరన్ మోగడంతో దుండగుల పరార్..
ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం రామాయి గ్రామీణ బ్యాంక్ దోపిడీకి దుండగులు విఫలయత్నం చేసిన ఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ రూరల్ మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అర్ధరాత్రి దోపిడీ చేసేందుకు ఒక ముఠా రాత్రి 1:30 సమయంలో గోడకు కన్నం వేసి, బ్యాంకులో చొరబడేందుకు ప్రయత్నించింది.

లాకర్ లో దాచి ఉన్న రూ.20లక్షల నగదును చోరీ చేసేందుకు ప్రయత్నించగా.. వెంటనే అక్కడ బిగించి ఉన్న అలారం సైరన్ మోగడంతో గ్రామస్తులు బ్యాంకు వద్దకు పరుగున వచ్చారు. ఇది గమనించిన నిందితులు అక్కడే చెప్పులు వదిలి పరుగులు తీసి పారిపోయారు. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక అలారం ఏర్పాటు చేయడం వల్ల బ్యాంకులో చోరీ జరగలేదని డి.ఎస్.పి జీవన్ రెడ్డి వివరించారు. రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సైలు, జాగిలాల సహాయంతో క్లూస్ టీం బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version